ఆడుతూ పాడుతూ హాయిగా ఇంగ్లిష్ నేర్చుకుందాం Photobucket

నేటి పాఠము 

Let's Learn The Form Of Tenses
  ప్రస్తుత lesson లో పై table లో ఒక verb ని తీసుకుని I అనే subject తో 12 వాక్యాలు వ్రాయడం జరిగింది. ఆ table క్రింద draw, eat, drink, hide, అనే మరో 4 verbs వాటి conjugation ఇవ్వడం జరిగింది. వీటితో మీరు 4x12=48 వాక్యాలు వ్రాసి నాకు మైల్ చేయండి. లేదా కామెంట్ గా పెట్టండి. tense పట్ల అవగాహన కలగడానికి ఇది ఎంతో దోహదకారి అవుతుంది. ఈ tables ని నేను మా దత్తు సార్ గారి దగ్గర practice చేశాను. మరి మీరు కూడా చేస్తారుగా. రేపు మరో 5 verbs ఇస్తాను. మీరు వాటిని We సబ్జెక్టు గా వ్రాయవలసి వుంటుంది. ఇలా 7 subjects తో 35 verbs కి 35x12=420 వాక్యాలు వస్తాయి. టెన్స్ పట్ల అవగాహన ఖచ్చితంగా వస్తుంది. ఆపై మీరు ఓరల్ ప్రాక్టీస్ చేస్తే మాటలాడటం వస్తుంది. దీనికి ముందు ఇదే బ్లాగులో వున్న Tense chapter చూడండి. దానిలో ప్రాధమిక అంశాలు, టెన్స్ కి సంభందించిన నియమాలు వుంటాయి.  READ MORE
 

 

 

 డియర్ ఫ్రెండ్స్

ఎక్కువ మాటలు అనవసరం.చెప్పాల్సింది సింపుల్ గా మనసుకు హత్తుకునేలా చెప్తూ 'ENGLISH' లోని అసలు మర్మాలు చెప్పడమే ఈ బ్లాగ్ ఉద్దేశ్యం.

ముందు ఇది తెలుసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినంతనే ENGLISH లో మాట్లాడలేరు. ENGLISH మాట్లాడే వారందరికి గ్రామర్ వచ్చని అర్ధం కాదు.

అసలు నీకు TELUGU గ్రామర్ ఎంత వచ్చని నీవు తెలుగు అంత అనర్ఘళంగా మాట్లాడుతున్నావు? నీవు చిన్నప్పుడు మాట్లాడుతూ చేసే తప్పులను 

సరి చేసి అమ్మ,నాన్న,ఇరుగు-పొరుగు, నీకు తెలియకుండానే 'తెలుగు' బేసిక్స్ చెప్తున్నారన్నమాట.

 

ఆపై నీకు నువ్వే నీ పరిసరాలనుండి, నీ అవసరాల నుండి ఎన్నోన్నో పదాలను- ఆపై వాక్యాలను నేర్చి ఈ దశకు వచ్చావు. అందుకే ముందుగా నేను చెప్పే ప్రాధమిక అంశాలను మనసు పెట్టి తెలుసుకో.  {ఇవి అన్ని నీవు  గ్రామర్ పుస్తకాలలో చదివినవే కావచ్చు-చదవని వారూ ఉండవచ్చు కదా. అదీ గాక 'బేసిక్స్' ఎప్పుడూ ముక్కున పెట్టుకుని వదిలేవి కావు. బేసిక్స్ లో PERFECTION లేనప్పుడు ఒక భాష నే కాదు, మరేమీ సాధించలేము.} ఆపై "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్న ఆర్యోక్తి ని నమ్మి పట్టుదలతో ముందుకు సాగిపో-

 

ఎందుకు? ఏమిటి? ఎలా? అని బాబు మోహన్ లా ప్రశ్నించకుండా ముందుగా నేను తెలియ జేయబోయే మినిమం కాన్సెప్ట్స్ ని  అవగాహన చేసుకుంటూ, అవసరమైనవాటిని  కంఠస్థం చేస్తూ - ప్రతి రోజు 10 పదాలైన నేర్చుకుంటూ ముందుకు సాగిపో.......ALL THE BEST

 

అలాగే నేను ప్రప్రదమంగా ప్రారంభించిన "learn english"( http://tellenglish.blogspot.in ) బ్లాగు మీరు ముందుగా చూడండి. దానిలోని కొన్ని అంశాలను దీనిలో  రీ పబ్లిష్ చేశాను. దానిలో అయితే మీరు కొంత గందరగోళపడతారు. దీనిలో ఒక  వరుస క్రమంలో వుంచే ప్రయత్నం చేస్తున్నాను... నిజంగా మీకు ఉపయోగ పడితే అదే పది వేలు. ప్రతాప్ 

మనవి: అందరికీ నమస్కారములు 

ఈ బ్లాగులో 3 నెలల క్రితము Lesson=9 వ్రాసాను. ఆతరువాత క్రొత్త lesson వ్రాయనే లేదు. కారణం అసలు ఈ బ్లాగు ఎవరికైనా ఉపయోగ పడుతుందో లేదో నాకైతే అర్ధం కావడం లేదు. చాలామంది చూస్తున్నారు గాని గెస్ట్ బుక్ open చేస్తే ఏ ఒక్కరినుండి ఏ ఒక్క చిన్న కామెంట్ కూడా వుండటం లేదు. ఎవరికీ ఉపయోగపడనప్పుడు ఇది ఒక చిత్తు కాగితముతో సమానము గదా.  అనవసరంగా దీనికోసం కొంత సమయము కేటాయించడం ఎందుకు ? అనే ఉదాసీనతతోనే క్రొత్త lessons వ్రాయడంలేదు. క్షంతవ్యుడను. మీ ప్రతాప్ 

000

నా మనవి కి  మధుసూదన్ లాంటి కొందరు మిత్రులు ఇలా స్పందించారు 

This is very wonderful attempt.  This type of site I did't see in my life , you did good for the society who want  to know the information about many things. I appreciate you, don't feel this blog is useless, This is very very useful . I request  you sir please start  again writing this blog- MADHUSUDHANA

మిత్రులు మధుసూధన గారికి కృతజ్ఞతలు. మనము ఏ పనీ ఫలితాన్ని ఆశించి చేయకూడదు. కానీ నేను కామెంట్ ని ప్రతిఫలంగా ఎందుకు ఆశించానంటే .. ఈ బ్లాగు అసలు ఉపయోగంగా వున్నదా లేదా / అనే విషయం తెలుసుకోవడానికి మాత్రమే. అంతే గాక నేను వ్రాసిన విషయాలలో తప్పులు దొర్లి వుండవచ్చు. వాటిని కూడా ఎవరూ నా దృష్టికి తీసుకురావడం లేదు. ఏది ఏమైనా నా ఆవేదనకు స్పందించిన మిత్రులకు కృతజ్ఞతలు చెబుతూ తిరిగి నాకు తెలిసిన 4 మాటలు వ్రాసే ప్రయత్నం ప్రారంభిస్తానని మీకు మాట ఇస్తూ సెలవు.. మీ ప్రతాప్
 

మిత్రులారా.."గెలిచిన వాడికి గతం వుంటుంది, ఓడినవాడికి వాడికి భవిష్యత్తు వుంటుంది. మరేం ఫర్లేదు. ముందుకు సాగి పోండి"

Myspace Generators & Toys